![]() |
![]() |
.webp)
మూవీ ఇండస్ట్రీలోకి కొత్తవాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియే. ఐతే ఇక్కడ కొంచెం తేడా ఉంది. గతంలో హీరోల వారసులు, హీరోయిన్ల వారసులు మాత్రమే మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కానీ ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు సింగర్స్ నెక్స్ట్ జెనెరేషన్స్ వాళ్ళు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి సింగర్స్ లో సునీత ఒకరు. ఆమె తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తల్లికి తగ్గ కొడుకుగా ఆకాష్ ఇండస్ట్రీలోకి తొలి అడుగు వేసాడు. ఆకాష్ ని ఇండస్ట్రీలోకి తీసుకురావడం కోసం ముందు నుంచి గ్రౌండ్ వర్క్ బాగానే ప్రిపేర్ చేశారు సునీత. ఆకాష్ కి సంబంధించిన ఫోటో షూట్స్, స్టిల్స్..ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకున్నారు.
ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ డైరెక్షన్ లో ‘‘సర్కారు నౌకరి’’ అనే సినిమాలో కనిపించబోతున్నాడు ఆకాష్. అలాగే ఈ మూవీ ద్వారానే నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమవుతున్నారు. సునీత ఎప్పటినుంచో తన కొడుకు కోసం కంటున్న కల ఇప్పుడు నిజం అయ్యింది. "పెద్ద రోగం చిన్న ఉపాయం సర్కారు నౌకరి " అనే టాగ్ లైన్ తో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. సింగర్ సునీత ఆ క్లిప్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు.
గతంలో మ్యూజిక్ డైరెక్టర్ , సింగర్ ఐన కోటి కుమారుడు హీరోగా పరిచయం అయినప్పటికి పెద్దగా మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. తర్వాత దేవి శ్రీప్రసాద్ కూడా వెండితెరపై వెలగాలనుకున్నాడు కానీ సాధ్యం కాలేదు.. ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ కొడుకు ఆది మాత్రం హీరోగా సెటిల్ అయ్యారు. మరి ఇప్పుడు సునీత కొడుకు ఆకాష్ సాహసం చేస్తున్నట్లే చెప్పొచ్చు. ఆయన నటించిన మూవీ ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది..టీజర్, ట్రైలర్ అన్నీ బయటకు వచ్చాక మూవీ రిలీజ్ అయ్యాక ఆకాష్ ని ఆడియన్స్ ఎలా చూస్తారు..? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాడా లేదా అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.
![]() |
![]() |